మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :
ఓల్డ్ రామచంద్రపురం హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ,బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి , బిజెపి సీనియర్ నాయకులు కంజర్ల కృష్ణమూర్తి పాల్గొనడం జరిగింది, అదేవిధంగా అమీన్పూర్ లో అద్దెల్లి రవీందర్, ఎడ్ల రమేష్, ఆగారెడ్డి ,అనిల్ చారి గార్ల ఆధ్వర్యంలో జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాల్లో కంజర్ల కృష్ణమూర్తి పాల్గొనడం రామచంద్రపురం బొంబాయి కాలనీలో నిఖిల్ బృందం ఆధ్వర్యంలో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లోనూ కంజర్ల కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజు, జి శ్రీనివాస్, నరసింహ, ఎల్లారెడ్డి ,విజయ్ గౌడ్, యాదయ్య, అరవింద్, మల్లేష్, యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా కంజర్ల కృష్ణమూర్తి మాట్లాడుతూ హిందూ బంధువులందరూ శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నంతగా ఉత్సాహంగా హనుమాన్ జయంతి వేడుకల్లోనూ పాల్గొన్నారు అని, ఇకపై జరగబోయే అన్ని వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని, ఆ దేవుని ఆశీస్సులతో పాత్రులు కావాలని కోరుకున్నట్లు తెలిపారు.