పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రామచంద్రపురం పట్టణ బిజెపి కార్యాలయంలో బిజెపి కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం పట్టణ బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శిగా బలరాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ నియామక పత్రాన్ని బలరాంకు అందజేశారు. అనంతరం బలరాం మాట్లాడుతూ బిజెపి పార్టీ కి అందించిన సేవలను, సమాజానికి చేసిన సేవలను గుర్తించి తనను నియమించిన జిల్లా పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి మరియు పట్టణ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్”కి బిజెపి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.నా పైన నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు రామచంద్రాపురం పట్టణంలో బిజెపి పార్టీని పటిష్ట పరిచేందుకు పార్టీ నియమాలకు లోబడి నా యొక్క శాయి శక్తులు ఉపయోగించి క్రియాశీలక పాత్ర పోషిస్తా అని తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్స్ లో గోల్కొండ కోట మీద బిజెపి జెండా రెపరెప లాడుతుందని అన్నారు పటాన్చెరు నియోజకవర్గంలో బిజెపి గెలుపు లక్ష్యం గా ముందుకు వెళ్తానని తెలిపారు