_విద్యార్థులే ఉపాధ్యాయులైనవేళ
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరువు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఒకే ఉపాధ్యాయుడే జాతి నిర్మాత విద్యార్థులు బాగా చదువుకొని పరీక్షలు బాగా రాయాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలను బోధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు బహుమతులు అందజేశారు . ఈ కార్యక్రమంలో సీతాలక్ష్మి, నాగేశ్వర్ సర్, శ్రీదేవి ,సుధారాణి,అరుణ మోహన్ ,సుధాకర్, అంజూమ్, పద్మజ, రాధిక ,రాధ, గీతాబాయ్ శ్రీదేవి రాజేశ్వర్, చంద్ర శేఖర్. ఏసుపాదం మొదలైన ఉపాద్యాయులు పాల్గొన్నారు.