పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ప్రతి ఒక్కరి స్వీయ అనగాహనే హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాప్తిని అరికడుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం (టీఎస్ఎసీఎస్) మంగళవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో జీవ నెపుణ్యాం ద్వారా హెచ్ఐవి నివారణసి ఒకరోజు సదస్సును నిర్వహించింది. గీతమ్ లోని జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెడ్ రిబ్బన్ క్లబ్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. టీఎస్ఏసీఎస్ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ పినపాటి ప్రసాద్, కాకతీయ విశ్వవిద్యాలయం డీన్ ప్రొఫెసర్ పింగళి నరసింహారావు, టీఎస్ ఏసీఎస్ సంయుక్త డైరెక్టర్ డాక్టర్ చంద్రారెడ్డి, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ టీ.ఎన్.స్వామి, అసిస్టెంట్ డైరెక్టర్ జి.రమేష్, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ తదితరులు పాల్గొని, లైఫ్ స్కిల్స్ ద్వారా హెచ్ఐవీ నివారణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు.
విశ్వవ్యాప్తంగా, మనదేశంలో, ముఖ్యంగా తెలంగాణలోని హెచ్ఐవీ కేసుల భయకంరమైన గణాంకాలను ఈ సందర్భంగా వారు ప్రముఖంగా ప్రస్తావించారు. స్వీయ అవగాహన, సమస్య పరిష్కారం, నిర్ణయం తీసుకోవడం, విమర్శనాత్మక ఆలోచన, భావప్రకటన, భావోద్వేగం, ఒత్తిడిని అధిగమించడంతో సహా హెచ్ఐవీ నివారణలో సహాయ పడే పది ముఖ్యమైన జీవన నైపుణ్యాలను నిపుణులు వివరించారు. హెచ్ఐవీ వ్యాప్తిచెందే వివిధ మార్గాలు, వ్యక్తులపై దాని ప్రభావాన్ని కూడా చర్చించారు. సవాళ్లను అధిగమించే డానికి, జీవన నైపుణ్యాలను ఉపయోగించుకునేలా హెచ్ఐవీ సోకిన వ్యక్తులను వక్తలు ప్రోత్సహించారు. ఈ సందర్భంగా వక్తృత్వ పోటీ నిర్వహించి విజేతలకు బహుముతులను ప్రధానం చేశారు. తొలుత, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త నాగేంద్రకుమార్ అతిథులను స్వాగతించారు. ఇతర సమన్వయకర్తలు, పలువురు విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.