_అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందిస్తాం
_పూర్తి పారదర్శకతతో దళారుల ప్రమేయం లేకుండా ఇళ్ల కేటాయింపు
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
దళారుల ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకతతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శనివారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మూడో విడత డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. రూపాయి ఖర్చు లేకుండా పైసా అప్పు లేకుండా అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. పటాన్చెరువు నియోజకవర్గం వ్యాప్తంగా 30 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించడం జరిగిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత తమపై ఉందన్నారు. విడతలవారీగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభయం ఇచ్చారు. అక్టోబర్ రెండవ తేదీన లబ్ధిదారులకు ఇల్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, కార్పోరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, లబ్ధిదారులు పాల్గొన్నారు.