520 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత…
– స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సివిల్ సప్లై గోదాం కు తరలింపు
– ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పట్టివేత
– 6 ఏ కింద కేసు నమోదు
పటాన్ చెరు:
హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పోగుచేసి పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై, ఎన్ ఫోర్స్ మెంట్, పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద తనిఖీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సివిల్ సప్లై అధికారి సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో సమకూర్చిన సుమారు 520 క్వింటాళ్ల రేషన్ బియ్యంను రెండు వేరు వేరు లారీలలో బుధవారం తెల్లవారుజామున ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మండలంలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు సివిల్ సప్లై, ఎన్ ఫోర్స్ మెంట్. పోలీసులు తనిఖీలు చేపట్టారు. రెండు గంటల వ్యవధిలో రెండు లారీల్లో తరలిస్తున్న అక్రమ బియ్యంను పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని స్వాధీనం చేసుకున్న 520 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టణంలోని సివిల్ సప్లై గోదాంకు తరలించారు. సివిల్ సప్లై యాక్ట్ 6 ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ సత్యనారాయణ, సివిల్ సప్లై అధికారి షఫీ ఉద్దీన్, శ్రీనివాస్, ఆర్ఐ రంగయ్య, వీఆర్ఏ సిబ్బంది పాల్గొన్నారు.