గీతం అధ్యాపకుడికి సెర్చ్ పరిశోధనా ప్రాజెక్టు…

politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ సెన్స్డ్ రసాయన శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ మల్లేశం బెల్జికి భారత శాస్త్ర , సాంకేతిక పరిశోధన మండలి ( సెర్చ్ ) పరిశోధనా ప్రాజెక్టును మంజూరు చేసింది . ఈ విషయాన్ని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె . నగేష ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . ‘ లిగ్నో సెల్యులోజ్నీ లిగ్నిన్- ఉత్పన్న రసాయనాలుగా మార్చడానికి నూతన , సమర్థ ఉత్ప్రేరక వ్యూహాలను రూపొందించడానికి ‘ చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు సెర్చ్ తగిన పాలనా అనుమతులతో పాటు రూ .33 లక్షల గ్రాంటును మంజూరు చేసిందని , రెండేళ్ళ వ్యవధిలో దీనిని పూర్తిచేయాల్సి ఉంటుందని ఆయన వివరించారు . ఈ పరిశోధనలో సాయపడేందుకు గాను ప్రాజెక్టు ఫెలో ( జేఆర్ఎఫ్ ) అవసరం ఉందని , ఎమ్మెస్సీ కెమిస్ట్రీ / అప్లయిడ్ కెమిస్ట్రీ / మెటీరియల్ సెన్స్లు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారు అర్హులని , సీఐఎస్ఆర్ – యూఐసీ – నెట్ / గేట్ / డీబీటీ / ఐసీఎంఆర్ అర్హత సాధించిన వారికి ప్రాధాన్యం ఉంటుందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు . ఇతర వివరాల కోసం 9966 9988 52 ను సంప్రదించాలి లేదా mbaithy@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని సూచించారు . సెర్చ్ పరిశోధనా ప్రాజెక్టు పొందిన డాక్టర్ మల్లేశంను గీతం ఉపకులపతి ప్రొఫెసర్ దయానంద సిద్ధవట్టం , హెదరాబాద్ ప్రోవీసీ ప్రొఫెసర్ డీఎస్ రావు , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సురేంద్రబాబు ఎంఎస్ , పలువురు అధ్యాపకులు , యూజీసీ వ్యవహారాల సమన్వయకర్త తదితరులు అభినందించి , గడువులోగా పరిశోధనను పూర్తిచేయమని సలహా ఇచ్చినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

గీతమ్లో ఘనంగా గాంధీ జయంతి జాతిపిత మహాత్మా గాంధీ 153 వ జయంతి ఉత్సవాలను గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు . గీతం స్కూల్ ఆఫ్ విశిష్ట అధ్యాపకుడు ప్రొఫెసర్ జీఏ రామారావు , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , ఎస్టేట్ అధికారి డీవీఏ మోహన్ , హార్టికల్చర్ అధికారి శరత్ బాబు తదితరులు గాంధీ స్క్వేర్లో నెలకొల్పిన మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ , సత్యం , శాంతి , అహింసలకు గాంధీజీ ప్రాధాన్యం ఇచ్చి , ప్రపంచానికే మార్గదర్శకునిగా మారారని కొనియాడారు . గాంధీ త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *