మనవార్తలు , శేరిలింగంపల్లి :
పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్ పేయిర్ లు ఎంతగానో ఉపయోగపడతాయని సీ ఎం ఆర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం రోజు మదీనగూడ లోని త్రివేణి పాఠశాల క్యాంపస్ లో సైన్స్ ఎక్స్పో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం త్రివేణి పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి, సి ఏ సి నటరాజ్ , సి ఆర్ ఓ సాయి నరసింహారావు మరియు వైస్ ప్రిన్సిపాల్ హిమబిందు ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సైన్స్ ఎక్స్పో వేడుకలు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
విద్యార్థులు రకరకాల నమూనాలు తయారు చేసి ప్రదర్శించారు. కొవిడ్ తరవాత జరిపిన మొదటి వేడుకలో తల్లిదండ్రులు సందర్శకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పిల్లలు తయారుచేసిన నమూనాల గురించి చక్కగా వివరించారు. వెనకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలతో సృజనాత్మకతను బయటకు తీయడానికి ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మేనేజ్మెంట్ ను అభినందించారు.