పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

politics Telangana

జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు

మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లని సమీ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ లయన్ కోడె సతీష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ కే. సుచరిత లు అన్నారు, చందానగర్ లోని శ్రీ విద్యా మందిర్ హై స్కూల్ లో నిర్వహించిన రెండురోజుల ఫ్యూజన్ ఫెస్ట్ సైన్స్ ఎగ్జిబిషన్ ను వారు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వివిధ ప్రాజెక్ట్ పరికరాలను తిలకించారు. విద్యార్థులు చక్కటి ప్రతిభతో రూపొందించిన ప్రాజెక్టుల గురించి వివరించి ఆకట్టుకున్నారు. అనాది కాలం నుండి ఆధునిక కాలం వరకు వినియోగిస్తున్న జీవన విధాన పద్ధతులు సాంకేతికత, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే వంటకాలు, చూడదగిన ప్రదేశాలు, వ్యవసాయ విధానం, ఆధునిక విద్యలో రాబోతున్న మార్పుల గురించి చక్కగా వివరించారు.కరస్పాండేట్ కే. శ్రీనివాస్ రావు, అడ్మిస్ట్రెస్ కే. ప్రశాంతి లు మాట్లాడుతూ పిల్లలలో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీయడం కోసం ఇలాంటివి ఉపయోగపడతాయని, విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఉపాద్యాయుల కృషి, అధ్యాపకుల అండదండలతో విద్యార్థులు బాగా చదువుకొని పైకి రావాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి రూపాల్లో కొలువై, బొమ్మల కొలువును ఏర్పాటు చేసి దసరా, బతుకమ్మ ల గురించి వివరించారు. బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *