పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
సైబర్ బెదింపులను ఎదుర్కోవడానికి, సైబర్ నేరాల గురించి సమాజానికి అవగాహన కల్పించడానికి ఒక సృజనాత్మక ప్రయత్నం, గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని అప్లైడ్ సైకాలజీ విభాగం చేసింది. ‘సే నో టు సైబర్ బుల్లియింగ్’ పేరిట వీథి నాటకాన్ని జే-బ్లాక్ ముందు, ప్రధాన ద్వారం ఎదుటి రోడ్డు మీద ప్రదర్శించారు. ఆన్ లైన్ భద్రత గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న పలువురు విద్యార్థులను ఇది ఆకర్షించింది.సైబర్ నేరాన్ని గుర్తించడానికి, నిరోధించడానికి ఆచరణాత్మక దశలను ఈ నాటకం ప్రదర్శించి, అప్రమత్తత, బాధ్యతాయుతమైన డిజిటల్ ప్రవర్తన ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. ఏదైనా సైబర్ బెదిరింపు సంఘటలు జరిగితే, వాటిని ప్రత్యేక హాట్ లైన్ 1930కు ఫిర్యాదు చేయడం, లేదా cybercrime.gov.in ని సందర్శించడం ద్వారా రక్షణ లేదా ఉపశమనం పొందవచ్చని ఆ నాటకం ద్వారా ఇచ్చిన సందేశంలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసిన విద్యార్థి ప్రతినిధి అఫ్రీన్ మాట్లాడుతూ, ‘డిజిటల్ యుగంలో తమను తాము రక్షించుకోవడానికి విద్యార్థులకు జ్జానం, సాధనాలతో సాధికారత కల్పించడమే మా లక్ష్యం. సురక్షితమైన ఆన్ లైన్ సంఘాన్ని సృష్టించడానికి ఈ వీధి నాటకం మా చొరవలలో ఒకటి’ అని పేర్కొన్నారు.
ఈ చొరవ విద్యార్థులు తమ చదువులో రాణించడమే కాకుండా, సమాచారం ఉన్న, చురుకైన పౌరులుగా మారేలా చేయడంతో పాటు, విద్యా నైపుణ్యాన్ని వాస్తవ ప్రపంచ సమస్యలతో అనుసంధానించడంలో గీతం నిబద్ధతను చాటి చెబుతోంది.