ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై
గాంధీ భవన్ లో ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్ష సమావేశం
సమావేశానికి హాజరైన నీలం మధు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
త్వరలో గ్రామస్థాయిలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అంతా సిద్ధంగా ఉండాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.తొందరలోనే డీసీసీ ల ఆధ్వర్యంలో మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచన ,ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమం ప్రతి వాడకు అభివృద్ధి లక్ష్యంతో పాలనను కొనసాగిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికె ఐదు గ్యారెంటీలను అమలుచేసి ప్రజలందరికీ అండగా నిలుస్తున్నారని , ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసంతో ఉన్నారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తమ తమ గ్రామాలలో అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని సూచించారు. అలాగే తొందరలోనే డీసీసీ అధ్యక్షుల అధ్వర్యంలో ప్రతి మండలం లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో స్థానిక సంస్థల్లో సైతం ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు ప్రజల మద్దతు చూరగోనెల పనిచేయాలని పిలుపునిచ్చారు.
