చిట్కుల్
తెలంగాణ రాష్ట్ర సమితి గ్రామ కమిటీలను,అనుబంధ సంఘాల నూతన కమిటీలకు అధ్యక్షులను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నియమించారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోతెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత నిర్మాణంలో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పటాన్ చెరు నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు .చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ ,అనుబంధన సంఘాల కమిటీలను ఎంపిక చేశారు .అధ్యక్షుడిగా డప్పు ప్రశాంత్ ను , ఉపాధ్యక్షుడిగా అంజిలకు నియామక పత్రాలను అందజేసి సత్కరించారు .
నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్కరూ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో EX ఎంపిపి శ్రీశైలం యాదవ్ , ఉప సర్పంచ్, ఎంపీటీసీలు వార్డ్ నెంబర్ సభ్యులు PCAS.ఛైర్మెన్ నారాయణ రెడ్డీ, మాజీ సర్పంచ్ రవీందర్ ,వి నారాయణ రెడ్డి గ్రామ నాయకులు, పెద్దలు యువత పాల్గొన్నారు .