_పోచారంలో కాంగ్రెస్ ఖాళీ..
_అభివృద్ధి మా అజెండా.. సంక్షేమమే మా ధ్యేయం
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల మూలంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు బి ఆర్ ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని, రానున్న రోజుల్లో బిఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారబోతుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం పోచారం గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొడ్డు జగన్, వార్డు సభ్యులు విజయ, నర్సమ్మ, యాదగిరి, లక్ష్మి, సుమారు 300 మంది అనుచరులతో కలిసి ఆదివారం సాయంత్రం గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.


అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి జెండా సంక్షేమమే లక్ష్యంగా నియోజకవర్గంలో కార్యక్రమా చేపడుతున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్తున్నామని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు చెప్పే కల్లబొల్లి మాటలను ప్రజలు విశ్వసించవద్దని విజ్ఞప్తి చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని అన్నారు. అతి త్వరలో నియోజకవర్గంలోని ప్రతిపక్ష పార్టీల సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, కోడూరి బిక్షపతి, తలారి బిక్షపతి, ఉప సర్పంచ్ రాజు, ఆంజనేయులు, యాదయ్య, కిష్టయ్య, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
