పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఈనెల 15వ తేదీన పటాన్చెరు పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, గిరిజన సంక్షేమ సంఘం ప్రతినిధులు, గిరిజన ఉద్యోగుల సంఘం సభ్యులతో కలిసి వేడుకల ఏర్పాట్లపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో అన్ని తాండాల నుండి పెద్ద సంఖ్యలో గిరిజనులు హాజరయ్యేలా కృషి చేయాలని ఆయన సూచించారు. పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిభను మించిన సంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతోపాటు, తండాలను పంచాయతీలుగా మార్చిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, గుమ్మడిదల జెడ్పిటిసి కుమార్ గౌడ్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఎంపీడీవో బన్సీలాల్, పార్టీ గ్రామ సర్పంచ్ లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ నరసింహ, తెలంగాణ బంజారా ఎంప్లాయిస్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిపి రాథోడ్, బంజారా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…