శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి :
:తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ చిహ్నంగా నిలుస్తుందని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రిన్సిపల్ ఉమామహేశ్వరి అన్నారు. గురువారం రోజు బీహెచ్ఈఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి రంగురంగుల ముగ్గులు వేసి గంగిరెద్దులతో డు బసవన్నలు ఆడిస్తూ పండుగ గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. కొత్త సంవత్సరం తొలి నెలలో వచ్చే మొదటి పండగ సంక్రాంతి కావడంతో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, ఆ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరిస్తూ విద్యార్థులు పండగ ప్రాముఖ్యతను వివిధ కళారూపాల ద్వారా ప్రదర్శించారు. ముఖ్యంగా తెలుగువారి లోగిళ్ళ ముందు అందమైన రంగవల్లులతో అలంకరిస్తారు. అలా పిల్లలను చిన్నప్పటినుండి మన తెలుగు పండుగల గురించి, వాటి ఔన్నత్యాన్ని తెలియజేయడం మన బాధ్యత అని ఉమామహేశ్వరి అన్నారు. ముందు ముందు కూడా పెరుగుతున్న పాశ్చాత ధోరణికి అనుగుణంగా తెలుగు పండుగలను కూడా జరుపుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.