పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంబరాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా మహిళా నాయకురాలు గడ్డ పుణ్యవతి అధ్వర్యంలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పటాన్ చెరు మాజీ జడ్పీటిసి బిఅర్ఎస్ నేత గడీల శ్రీకాంత్ గౌడ్ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి మరియు పాల్గొన్న మహిళలకు బహుమతులను అందజేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ బోగీ, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలిపారు .భారత దేశ సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలను తెలుగు సంస్కృతిని ప్రతిపాదించడమే పండుగలు ముఖ్య ఉద్దేశం అని ఇటువంటి పండుగల యొక్క గొప్పతనాన్ని సాంప్రదాయాన్ని మరవకూడదని నేటి తరానికి కూడా సంక్రాంతి పండుగ ముఖ్య ఉద్దేశం తెలియజేయడానికి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమాలను నిర్వహించమని , మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ముగ్గుల పోటీలు అని తెలిపారు .ఈ కార్యక్రమంలో పటాన్ చెరు వైస్ ఎంపీపీ స్వప్న,బిజేపి రాష్ట్ర నాయకులు దేవేందర్ గౌడ్ , మాజీ ఎంపీటీసీ గడ్డి యాదయ్య , మరియు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు