శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి :
శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గం,, దర్గా లో గల నాగార్జున ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. మకర సంక్రాంతి సందర్భంగా నాగార్జున ఉన్నత పాఠశాలలో భోగి, మకర సంక్రాంతి, కనుము ఇలా మూడు రోజుల పండుగను కన్నుల ముందు ఉంచారు. మొదటగా భోగి సందర్భంగా చిట్టి పొట్టి చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. తరువాత మకర సంక్రాంతీ సందర్భంగా పాలు పొంగించి, పొంగల్ చేసి అందరికి ప్రసాదం ఇచ్చారు. కనుమను సందర్భంగా గంగిరెద్దులను తీసుకొచ్చి వాటిని పూజించి వాటితో పిల్లల ముందు డూ.. డూ బసవన్నతో ఆడించారు. విద్యార్థులందరూ ముంగిట్లో అందమైన రంగవల్లికలతో అందరినీ అబ్బుర పరచారు.. మరియు పాఠశాల కరస్పాండెంట్ ఎ. భరత్ కుమార్ సంక్రాంతి పండుగ విశిష్టతను అందరికి తెలిపారు. ఈ సంబరాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎంతో ఆసక్తితో పాల్గొన్నారు. ఈ సంబరాల్లో అందరినీ మెప్పించిన విషయం సంక్రాంతి సాంప్రదాయ వంటకాలతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు రకరకాల పిండి వంటకాలతో అందరినీ మెప్పించారు. ఈ విద్యార్థులు చక్కటి రంగవల్లికలు,, రుచికరమైన వంటకాలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాలన్నింటిలోను పాఠశాల చైర్మన్ కృష్ణ, ప్రిన్సిపాల్ సుందరీ, ఉపాధ్యాయ బృందం,, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.