శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో – ఆర్డినేటర్ రాజు ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటిలో పాల్గొన్న విజేతలకు పాశమైలారం మాజీ సర్పంచ్ సుధాకర్ గౌడ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ముగ్గుల పోటీలలో పాల్గొని సృజనాత్మకతను చూపించడం అభినందనీయమన్నారు. ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించిన శ్రామిక సంక్షేమ కేంద్రం బాధ్యులను అభినందించారు.. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు తమవంతు సహాయసహకారాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.శ్రామిక సంక్షేమ కేంద్రం కో ఆర్డినేటర్ రాజు మాట్లాడుతూ శ్రామిక ప్రజల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అందరి సహకారంతో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శ్రామిక సంక్షేమ కేంద్రం బాధ్యులు వెంకటేష్, చంద్రయ్య, ఈశ్వరరావు, ప్రభు, అనాజీ, రమేష్, శ్రీను, యకమ్మ, దేవి, హేమ,సువర్ణ, హారిక, మాదవి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *