చిన్నారుల ఆరోగ్యం, ఫిట్నెస్‌పై ప్రత్యేక దృష్టి
మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
ఇప్పుడు పిల్లలంతా కంప్యూటర్లకు, ఐపాడ్‌కు అతుక్కుపోతున్నారు, అన్నం తినేటప్పుడు ఐపాడ్ చేతిలో లేకుంటే వారికి ముద్ద దిగడం లేదు ఒక తల్లిగా నేను కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాను. అయితే పిల్లలకు ఆరోగ్యకరమైన వాతావరణం, మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన వాతావరణంలో చదువు అనేది ఎంతో ముఖ్యం. శ్రీజ కొణిదెల, స్వాతి గునుపాటి ఏర్పాటుచేసిన సీ సా స్పేసెస్‌లో ఇప్పుడు నేను భాగస్వామురాలిని అవుతున్నాను. చిన్నారులకు ఒక సరైన దిశా నిర్ధేశం చూపే అద్భుతమైన ప్రాంతం ఇది అని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సానియా మీర్జా అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 10 ఏడాది కిందట సినీనటుడు చిరంజీవి కుమార్తె శ్రీజ కొణిదెల, సహ భాగస్వామి స్వాతి గునుపాటి ఆధ్వర్యంలో సీ సా స్పేసెస్ పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించారు. ఏడాది నుంచి 12 ఏళ్ల చిన్నారుల వరకు వారి ఆరోగ్యం, చదువు, నడవడికలపై దృష్టి పెట్టేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నుంచి ఇక్కడికి వచ్చే చిన్నారులకు పిట్నెస్, ఆరోగ్యం విషయంలో తాను సీ సాతో భాగస్వామురాలినై పిల్లలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు సానియా మీర్జా తెలిపారు. ఒక ఆటలే కాకుండా ఆరోగ్యానికి కుటుంబ సభ్యులతో కలసి వచ్చి ఇక్కడ ఉండేలా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు.

హైదరాబాద్ ఒక టాడ్లర్ సిటీగా మారనుందని అన్నారు. 2025లో తాను తీసుకొన్న నిర్జ్ఞయాలలో ఇది ఒకటని, కొత్తగా మార్పు లేవని ప్రతి ఒక్కరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.స్వాతి గునుపాటి సీ సా ఫౌండర్ మాట్లాడుతూ పెరేంట్స్ కోసం కెఫే ఏర్పాటుచేశాం. ఇక్కడ ఏడాది వయసున్న పిల్లల నుంచి టీనేజర్ల వరకు ఇక్కడ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
శ్రీజ కొణిదెల కో-ఫౌండర్ మాట్లాడుతూ సానియా మీర్జా పిల్లలను తన క్రీడల ద్వారా మరింత ప్రభావితం చేయంనుందన్నారు. ఈ కేంద్రాన్ని ఒక వ్యాపారంలా కాకుండా చిన్నారులకు ఉపయోగపడేలా ఇక్కడ తీర్చిదిద్దామన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు రోల్‌మాడల్ అని. పిల్లలను తీసుకొని ఇక్కడికి వస్తే. పిల్లలు వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నారన్నారు. తల్లిదండ్రలు ఇక్కడ తమ పని తాము చేసుకొనేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. త్వరలోనే దీనిని హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో విస్తరిస్తామన్నారు.
