సంగారెడ్డి :
తెలంగాణ రాష్ట్రoలో వెనుక బడిన బీసీ కులాలందరికి బీసీ బంధు ప్రకటించి, ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బిసి సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు తెనుగు నర్సింలు ముదిరాజ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ స్వర్ణలత కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర జాతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బీసీలకు, వెనుకబడిన అన్ని కులాలకు బీసీ బంధు ప్రకటించాలని డిమాoడ్ చేశారు.
జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. తోలిగించిన ఫీల్డ్ అసిస్టెంట్ లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిసిల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు..బీసీ బంధు ప్రకటించక పోతే కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
తోలిగించిన ఫీల్డ్ అసిస్టెంట్ లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిసిల ఐక్యత వర్ధిల్లాలి అంటూ బ్యానర్ తో ప్రదర్శన నిర్వహించారు.బీసీ బంధు ప్రకటించి క పోతే కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్తామని వారు హెచ్చరించారు.సంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పి గణేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీ బంధు ను ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో.జి.సుధాకర్ యాదవ్. భేరీ చంద్ర శేఖర్ యాదవ్ మరియు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.