మనవార్తలు ,అమీన్ పూర్:
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ సీనియర్ మహిళా నాయకురాలు టీ. మేఘన రవీందర్ రెడ్డి మరియు కే. సరస్వతి లక్ష్మణ్ స్వామికి మంగళవారం రోజు అమీన్ పూర్ మున్సిపల్ కౌన్సెలర్ మరియు సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు టీ. మాధురి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యురాలుగా నూతనంగా ఎన్నుకున్నారు , అలాగే వాళ్లకు పత్రాలను అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు గడ్డ పుణ్యవతి, బొల్లారం మున్సిపల్ మహిళా మోర్చా అధ్యక్షురాలు డి. స్రవంతి నరసింహ రెడ్డి పాల్గొన్నారు.