కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా_సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ బాల మురళీకృష్ణ (చిన్న ముదిరాజ్)

politics Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

పటన్ చెరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాల మురళీకృష్ణ కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ గా నియమితులయ్యారు, పటాన్ చెరు మండలంలో గత 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి పార్టీ అభివృద్ధి కోసం క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉన్నారు, అందుకుగాను తన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ బాల మురళీకృష్ణ జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ నియమిస్తూ జిల్లా అధ్యక్షురాలు తూర్పు నిర్మల జయప్రకాశ్ రెడ్డి నియామక ఉత్తర్వులు జారీ చేశారు, శనివారం రోజు నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షురాలు చేతుల మీదుగా అందుకున్నారు, ఈ సందర్భంగా బాల మురళీకృష్ణ మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు పార్టీ అభివృద్ధి కోసం జరిగే సాధారణ ఎన్నికలలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన సంగారెడ్డి శాసనసభ్యులు తూర్పు జయప్రకాశ్ రెడ్డి, మరియు కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోప్రసన్న కుమార్, అరుణ్ గౌడ్, విజయ్, అరుణ్ యాదవ్, అడ్డు, శ్రీనివాస్, తుల్జారాం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *