ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగడుతాం జిల్లా పదాధికారుల సమావేశంలో సామ రంగారెడ్డి

Districts politics Telangana

మనవార్తలు, శేరిలింగంపల్లి :

ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేయకుండా ఏవిందంగా మోసం చేస్తుందో ప్రజల్లో ఎండగడుతామని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు. మంగళవారం రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియపూర్ ఆర్.బి.ఆర్ కాంప్లెక్స్ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రాచమల్ల నాగేశ్వర్ గౌడ్ అధ్యక్షతణ నిర్వహించిన జిల్లా ఓబీసీ మోర్చా పూర్తి స్థాయి పదాధికారుల సమావేశానికి ఆయన ముఖ్యాథి గా ఆయన హాజరై మాట్లాడుతూ రాష్ట్రoలో టీఆరెస్ ప్రభుత్వం ఓబీసీలను కేవలం ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటూ ఎలాంటి సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారన్నారు.

హుజురాబాద్ ఎన్నికల అనంతరం జరిగే పరినామాలను పక్కదోవ పట్టించేందుకు కేంద్రం వడ్లు కొనడం లేదని, దొంగ దీక్షలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఏ ఆకాంక్ష కోసమైతే తెలంగాణ ఏర్పడిందో దాన్ని తుoగలో తొక్కి కుటుంబ పాలన కొనసాగిస్తు నియంతలా వ్యవహారిస్తున్న కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యం కొనడానికి సిద్ధంగా ఉన్నప్పటికి, రాష్ట్ర ప్రభుత్వం వడ్లను సేకరించకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. కళ్లాల్లో వడ్లు పెట్టుకొని నిరీక్షిస్తున్నా పట్టించుకోకుండా వారిని ఆత్మహత్యలు చేసుకునేలా టీఆరెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.

ఇక్కడ రైతులకు ఏమి చేయనోడు ఎక్కడో చనిపోయిన రైతులకు 3 లక్షలు ఇస్తానని ప్రజలను ఇంకా మభ్యపెడుతున్నాదాని వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి వారి బండారాన్ని ఎండగట్టేలా ప్రజలను చైతన్యo చేస్తామన్నారు. అన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వగా రైతుల నుండి వడ్లు సేకరించకుండా ఇబ్బందులు పెట్టడం మంచిధికాదని హెచ్చరించారు. ఎన్నికల్లో హామిలివ్వడం తర్వాతమర్చిపోవడమే కేసీఆర్ నైజం అని తెలిపాడు.

ఓబీసీ జిలా అధ్యక్షుడు రాచమల్ల నాగేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ బూత్ స్థాయిలో కమిటీలు వేసి, బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఓబీసీ ని సంస్థాగతంగా అభివృద్ధి చేసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎత్తి చూపుతామన్నారు. అబద్దాలు ఆడిన వారికి అవార్డు లిస్తే అందులో కేసీఆర్ కు మొదటి బహుమతి వస్తుందన్నారు. ధర్నా చౌక్ ఏత్తెసి నాడు ధర్నా ఎలా చేస్తాడని ప్రశ్నించారు.

ఇక ప్రజలు కేసీఆర్ ను నమ్మరని, ఢిల్లీ కి పోయి పడిగాపులు కాస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా ఇంచార్జ్ ఎం.కోమరయ్య, ప్రధానకార్యదర్శి ఎస్.శ్రీశైలం కురుమ, ఎస్.వెంకటేష్, వి. దశరథ్ సాగర్, డి ఆర్ కె ప్రసాద్, ఉపాధ్యక్షులు ఎం. స్వామి గౌడ్, ఎన్.నరేందర్ ముదిరాజ్, రఘు గౌడ్, జిల్లా కార్యదర్శి అనిల్ గౌడ్, కార్యదర్శులు హరికిషన్ జి, జంగయ్య యాదవ్, మియపూర్ డివిజన్ నాయకులు మనిక్ రావు, ప్రధాన కార్యదర్శి ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, ఆంజనేయులు, డి.చందు, రవి గౌడ్, ప్రభాకర్ హఫీజ్ డివిజన్ అధ్యక్షుడు శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *