పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలకు సైతం రక్షిత మంచి నీరు అందించేందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీలో గల అపార్ట్మెంట్ వాసుల కోసం 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న పైపులైన్ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి మంచినీరు అందించాలని లక్ష్యంతో నూతన రిజర్వాయర్లు, పంపు హౌస్ లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఉపాధి అవకాశాలకు అనుగుణంగా నూతన కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని.. వాటిలో మౌలిక వస్తువుల కల్పనకు ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, కృషి డిఫెన్స్ కాలనీ అధ్యక్షులు అమరేందర్, ప్రధాన కార్యదర్శి మాణిక్ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.