ఎమ్యెల్యేగూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు

Districts Telangana

పటాన్‌చెరు

పటాన్‌చెరులో సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి.ఎమ్యెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.పట్టణం లోని సాకి చెరువు కట్టపై ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మహిళలు భారీ సంఖ్యలో తరలి వచ్చి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.తెలంగాణ సంస్కృతి సంప్రదాయలు కాపాడేలా ప్రతి ఒక్కరు సద్దుల బతుకమ్మలో ఉత్సాహంగా పాల్గొనడం సంతోషంగా ఉందని అతిథులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు.

పోయిరా బతుకమ్మ ఉయ్యాలో ..మళ్లీ రా బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడబిడ్డలు సద్దుల బతుకమ్మ  అట పాటలతో , కళాకారుల ప్రదర్శనతో ,  సాకి చెరువు మారు మ్రోగింది. సీఎం కేసీఆర్ చొరవతో బతుకమ్మ పండుగలను అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతీ ఏడాది అన్ని పండుగలను ఎమ్మెల్యేమహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ఎంపీ కొత్త ప్రభాకర్‌ కొనియాడారు.

ఇక చివరి రోజు బతుకమ్మ సంబురాల్లో భాగంగా పోటీల్లో పాల్గొన్న ఆడపడుచులకు బహుమతులను అందజేశారు. మొదటి బహుమతిగా 20 వేలు, రెండో బహుమతిగా 15 వేలు, మూడో బహుమతిగా 10 వేల నగదుతో పాటు మరో పది మం దిని ఎంపిక చేసిన వారికి పట్టు చీరలను కన్సో లేషన్ బహుమతులు అందజేశారు.   సీఎం కేసీఆర్ చొరవతో బతుకమ్మ పండుగలను అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్‌ ఛైర్మన్‌ భూపాల్‌ రెడ్డి, జెడ్పీ ఛైర్మన్‌ మంజుశ్రీ, ఎస్పీ రమణకుమార్‌, జీఎంఆర్‌ కుటుంబ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *