ప్రభుత్వ నిబంధనలకు లోబడి సేవలు అందించాలి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఆర్ఎంపి, పిఎంపి వైద్యుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఆర్ఎంపి, పిఎంపిలు ఎమ్మెల్యే జిఎంఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో జిల్లా వైద్యాధికారులు తనిఖీలు చేసి పలు ఆర్.ఎం.పి, పి.ఎం.పి క్లినిక్ లను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే పనిచేయాలని వారికి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రిస్క్రిప్షన్లు, పరీక్షలు నిర్వహించకూడదని తెలిపారు. ప్రభుత్వంతో చర్చించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం జిల్లా వైద్యాధికారిణి గాయత్రీ దేవితో మాట్లాడి.. భవిష్యత్తులో ఆర్.ఎం.పి, పి.ఎం.పి లు నిబంధనలకు విరుద్ధంగా పనిచేయకుండా చూస్తామని తెలిపారు. నిబంధనలో ఉల్లంగించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…