మనవార్తలు, కూకట్ పల్లి :
నిజాం పెట్ మున్సిపాలిటి పరిధిలో అభివృద్ధి పనుల పై అడిషనల్ కలెక్టర్ జాన్ శాంసన్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, కమిషనర్ శంకరయ్య అధ్యక్షతన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బడ్జెట్ 2022-23 అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో రోడ్లు,చెరువులు,ఫుట్ పాత్ మరియు పార్క్ ల అభివృద్ధి,10శాతం పచ్చదనం పరిశుభ్రత కు,అదే విధంగా కార్పొరేషన్ పరిధిలో చేపట్టే పలు నిర్మాణ అభివృద్ధి పనులు,మరియు పలు మౌలిక సదుపాయాల రూప కల్పన వాటికి అనుగుణంగా కేటాయించబడే బడ్జెట్ అంచనా గురించి చర్చించారు. ఈ మేరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగా భవన నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాల సేకరణ మరియు ప్రాసెసింగ్ సేవలు వంటి కీలక అంశాలను సమావేశంలో చర్చించడం జరిగిందని వారు తెలిపారు.
ఈ సమావేశంలో ఎన్ ఎం సి ఆయా విభాగాల అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.