పరిశోధనే ప్రగతికి సోపానం: డాక్టర్ అనువ్రత్ శర్మ

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఫార్మాస్యూటికల్ రంగంలో పరిశోధన ఆవశ్యకత పెరిగిందని, శోధనే పురోగతికి మైలురాయిగా మారిందని అను స్పెక్ట్రా కన్సల్టింగ్ వ్యవస్థాపకుడు, డైరక్టర్ డాక్టర్ అనుప్రీత్ శర్మ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘నర్చరింగ్ రీసెర్చ్’ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. ఫార్మాస్యూటికల్, కెమికల్ పరిశ్రమలలో విద్య, పరిశోధనా అవకాశాలు, వాటి ప్రాముఖ్యత గురించి ఆయన వివరించారు. చాలా ఫార్మా ఉద్యోగాలకు వ్యక్తులు బ్యాచిలర్ డిగ్రీ నుంచి పీహెచ్ డీ వరకు నిర్దిష్ట స్థాయి అర్హత, పరిశోధనా ఉత్సాహాన్ని కలిగి ఉండాలన్నారు. ఫార్యాస్యూటికల్ రంగంలో ఒక బలమైన పరిశోధన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి తన ఉపన్యాసం ఎంతో దోహదపడుతుందంటూ, సపేరే- ఆడే అంటే డేరింగ్ టు కాన్సెప్ట్ గురించి ప్రసంగించారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులను ప్రోత్సహించడానికి, నిగూఢమైన పరిశోధనా ప్రపంచంలోని రహస్యాలను ఛేదించడంలో తనవంతు తోడ్పాటునందించారు. పరిశోధనలకు విద్య, నైతికల , నెతిక విలువల బలమైన పునాది అవసరమని, ఇవన్నీ గీతం వంటి విద్యా సంస్థల కోర్సుల బోధనా సమయంలోనే పెంపొందిస్తారని చెప్పారు. విద్యార్థుల ప్రశ్నలకు సందర్భోచిత జవాబులిచ్చి ఆకట్టుకున్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. శివకుమార్, అతిథికి ఘన స్వాగతం పలికి, విద్యార్థులు, అధ్యాపకులతో ఆయన విశేష అనుభవాలను పంచుకున్నందుకు సత్కరించారు. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ గటడి శ్రీకాంత్ వందన సమర్పణతో ఈ ఉపన్యాస కార్యక్రమం ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *