పరిశోధన నిరంతర ప్రక్రియ…

Telangana

– జాతీయ రీసెర్చ్ సింపోజియంలో అతిథుల అభిభాషణ

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

పరిశోధన అనేది అభ్యాసం, సమయం.. రెండింటినీ తీసుకునే నిరంతర ప్రక్రియ అని, మంచి పరిశోధకులు నిరంతరం తమను తాము ప్రశ్నలు వేసుకుంటూ, ఆ ప్రక్రియలో తాము ఎక్కడున్నారో మూల్యాంకనం చేసుకుంటారని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆర్కిటెక్చర్లో పరిశోధనను పెంపొందించడానికి జూలై 21-22 తేదీలలో ‘విద్యార్థుల కోసం నేషనల్ రీసెర్చ్ సింపోజియం’ను గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హెదరాబాద్ నిర్వహించింది.ఆర్కిటెక్చర్ కౌన్సిల్ శిక్షణ, పరిశోధన విభాగం డెరైక్టర్ ప్రొఫెసర్ జయశ్రీ దేశ్పాండే; పంజాబ్లోని చిత్కారా విశ్వవిద్యాలయం పరిశోధనా విభాగం డీన్ ప్రొఫెసర్ హర్వీన్ భండారీలు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు పాల్గొ న్నారు. పరిశోధన ప్రక్రియ నిరంతర చక్రమని, ఇది మొత్తం ప్రక్రియను మళ్లీ మళ్లీ తనిఖీ చేయడం, మూల్యాంకనం చేయడం, విశ్లేషించడం, పునరావృతం చేయడంగా వారు అభివర్ణించారు.

పరిశోధనా ప్రక్రియ ఆయా అంశాలలో నిపుణులుగా మారడానికి, పత్ర సమర్పణ చేయడానికి, వ్యాఖ్యలు లేదా విశ్లేషణలు రాసే వీలు కల్పిస్తుందన్నారు.ప్రశ్న యొక్క భావాన్ని పెంపొందించడానికి, చదవడం, చర్చను ప్రారంభించడం, దానిని సొంత మాటలలో కూర్చడం, తెలుసుకున్న దాన్ని నేర్పుగా ప్రదర్శించడం, ప్రేక్షకుల ప్రశ్నలకు ప్రతిస్పందించడం వంటి నాలుగు సాధారణ దశలను ప్రొఫెసర్ జయశ్రీ వివరించారు. ఇటువంటి సదస్సులను నిర్వహించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని, నేర్చుకున్న దానిని ముద్రిత రూపంలో తేవాలని ఆమె సూచించారు. మంచి పత్ర సమర్పణ, అందులోని దశలు, మెళకువలను ప్రొఫెసర్ హర్వీన్ వివరించారు.

తొలుత, గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డెరైక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ అతిథులనుసత్కరించారు. కళ, వాస్తుశిల్పం ద్వారా నగరాల గుర్తింపు; నిర్మాణ సంస్కృతి, వారసత్వ నిర్వహణ; పర్యావరణ సామర్థ్యం, స్థిరమైన భవిష్యత్తు; సమకాలీన నిర్మాణ పద్ధతులు, వాస్తుశిల్పంలో వైవిధ్యం వంటి ఇతివృత్తాలతో ఈ సింపోజియంను ఏర్పాటు చేసినట్టు నిర్వాహకురాలు ప్రొఫెసర్ కుర్రి శ్రీ స్రవంతి తెలియజేశారు. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ సౌపూర్ణి పాల్ వందన సమర్పణ చేశారు. గీతం ఆర్కిటెక్చర్ డీన్ విభూతి సచిదేవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.దేశం నలుమూలల నుంచి 15 మంది విద్యార్థులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించగా, 13 మంది ఇందులో స్వయంగా పాల్గొని తమ పరిశోధనా ఫలాలు, నైపుణ్యాలను సదస్యులతో పంచుకున్నారు. పలువురు ఆర్కిటెక్చర్ అధ్యాపకులు, విద్యార్థులు ఇందులో పాల్గొని, తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *