మనవార్తలు ,రామచంద్రాపురం :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వుడ్ బేస్డ్ ఇండస్ట్రీస్ పేరుతో ఈ నెల తీసుకువచ్చిన జి ఓ 69 ను రద్దు చేసి, ఇంతకు ముందు ఉన్న 2016 లో ఇచ్చిన 10 హెచ్ పి. జి ఓ 55 ను అమలు చేయాలని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏరోజు బిక్షపతి చారి ఇచ్చిన పిలుపు మేరకు గురువారం. రోజు పటాన్ చెరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం తరఫున రామచంద్రాపురం ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ జి.ఓ 69 వలన రాష్ట్రంలోని కార్పెంటర్లందరికీ తీరని అన్యాయం జరుగుతుందని, అలాగే వాళ్ల జీవనోపాధి కోలుకోని విధంగా దెబ్బతింటుందని, కార్పెంటర్ వృత్తిపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పెంటర్ యూనిట్ల కు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ హోదా కల్పించి వాటి పురోగతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు, ఈ జి. ఓ 69 వల్ల ఇదివరకే చాలా నష్టాల్లో ఉన్న కార్పెంటర్ యూనిట్లను మరింత నష్టాల్లోకి నెట్టివేసినట్టు అవుతుందని, కావున పాత జి.ఓ 55 అమలు చేయాలని సత్వరమే జి ఓ 69 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి,ఉపాధ్యక్షులు కొల్లోజు కృష్ణ చారి, కోశాధికారి ర్యాలమడుగు వడ్ల శంకరాచారి, ఇతర కార్యవర్గ సభ్యులు మధుపంతులు,వడ్ల రాజేందర్ చారి,పాతూరి వడ్ల రాము చారి, రవి చారి ,నరేష్ చారి మరియు ఇతర సంఘం సభ్యులు పాల్గొన్నారు.