గీతము సందర్శించిన అమెరికా వర్సిటీ ప్రతినిధులు..

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు :

అమెరికాలోని ట్రాయ్ విశ్వవిద్యాలయం , కంప్యూటర్ సెన్స్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుమన్ కుమార్ , రిక్రూట్మెంట్ సలహాదారు అనిందిత హాల్డర్లు గురువారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హెదరాబాద్ ప్రాంగణాన్ని సందర్శించారు . ట్రాయ్ విశ్వవిద్యాలయం , గీతం మధ్య భావి విద్యా సహకారం గురించి ఆ ప్రతినిధులు చర్చించినట్టు కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ పి.త్రినాథరావు వెల్లడించారు . చర్మ ఆరోగ్య పర్యవేక్షణ , రవాణా డేటా – సెన్సార్ నెట్వర్క్లను వినియోగించి పెద్దయెత్తున పర్యావరణ పర్యవేక్షణ ఒక సేవగా చేయడం తమ పరిశోధనా ఆసక్తులుగా వారు వివరించినట్టు తెలిపారు . గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ.ఎస్.కుమార్ , తనతో పాటు కంప్యూటర్ సెన్ట్స్ ( ఇన్ఛార్జ్ ) విభాగాధిపతి డాక్టర్ కె.ఎస్.సుధీర్ తదితర గీతం అధ్యాపకుల బృందం వాటితో చర్చించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *