మనవార్తలు ,పటాన్చెరు
తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డిజిల్ పై వ్యాట్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ రుద్రారంలో ఎడ్ల బండిపై తిరుగుతూ నిరసన ప్రదర్శించిన పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ఈ సందర్భంగా గడీల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ పెట్రోలో, డీజిల్‌పై విధించిన 35.2 శాతం వ్యాట్ ను తగ్గించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘
కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతో దీపావళి సందర్భంగా ఈనెల 3న పెట్రోల్ ధరలను ఒక్కో లీటర్ పై రూ. 5లు, డీజిల్ పై రూ. 10 తగ్గించారు. ప్రజలపై భారం తగ్గించేందుకు రాష్ట్రాలు తమ పన్నుల వాటాను కూడా తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని పిలుపు మేరకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలుసహా దాదాపు 23 రాష్ట్రాల ప్రభుత్వాలు ధరలను తగ్గించాయి. కేసీఆర్ సర్కార్ తగ్గించలేదని ఆరోపించారు.
2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రోలు, డీజిల్ పై పెంచిన 4 శాతం వ్యాట్ ను తగ్గించే చర్యలు తీసుకోకుండా సమస్యను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. గత ఏడాది మే నుండి ఈ ఏడాది నవంబర్ వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 8.83, డీజిల్‌పై రూ.5.68 వ్యాట్‌ని పెంచింది. సాధారణంగా ఇన్‌పుట్ ధర పెరుగుదల సమయంలో అదనపు పన్ను విధింపును కేంద్రం అనుమతించడం లేదు. ప్రజావాణికి అనుగుణంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించే వరకు బీజేపీ ఆందోళన కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఈశ్వరయ్య, జిల్లా నాయకులు దేవెందర్ గౌడ్, వీరెష్, సాయి, ధన్ రాజ్, సంపత్, దస్తగిరి, అశొక్ తదితరులు పాల్గొన్నారు.