ఛాయాచిత్రకళలో వాస్తవాన్వేషణ

Telangana

గీతంలో ఫోటోగ్రఫీపై ఆతిథ్య ఉపన్యాసం చేసిన ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ జాన్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

‘ఒక చిత్రం వెయ్యి పదాలకు సమానం’ అనేది నానుడి. దానిని మరింత విస్తృతపరుస్తూ, ఛాయాచిత్రకళలో ‘నిజాన్ని వెతుక్కుంటూ..’ అనే శీర్షికన, ఐఐటీ హైదరాబాదుకు చెందిన డాక్టర్ దీపక్ జాన్ మాథ్యూ బుధవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో ఆతిథ్య ఉపన్యాసం చేశారు.ఛాయాచిత్రకళపై లోతైన అవగాహనను ఏర్పరచేలా సాగిన ఈ కార్యక్రమంలో, ఫోటోగ్రఫీలో వాస్తవికత యొక్క అర్థం, దాని చారిత్రక పరిణామం, ప్రామాణికత, ఫోటోగ్రఫీ, పెయింటింగ్ మధ్య దీర్ఘకాలిక పరస్పర చర్యను ఆయన వివరించారు. శతాబ్దాలుగా ఫోటోగ్రఫీ ఎలా మారిపోయిందో డాక్టర్ మాథ్యూ అన్వేషించారు. వాస్తవికత యొక్క అవగాహనలను రూపొందించి, వాటిని పునర్నిర్వచించారు. ఎంతో ఆకర్షణీయంగా, ఆకట్టుకునేలా సాగిన ఈ కార్యక్రమం వివిధ విభాగాల నుంచి వచ్చిన విభిన్న ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించింది. దృశ్య కథ చెప్పే కళ, విజ్జాన శాస్త్రంపై తాజా దృక్పథాలను మాథ్యూ వివరించారు.గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్) లోని మీడియా స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి, అసోసియేషన్ ఆఫ్ డిజైనర్స్ ఇండియా, ఐఐటీ హైదరాబాదులు సహకారం అందజేశాయి.

కుండల తయారీపై అవగాహన

జీఎస్ హెచ్ఎస్ లోని లలిత, ప్రదర్శన కళల విభాగం కుండల తయారీపై అత్యంత ఆకర్షణీయమైన ఒకరోజు కార్యశాలను నిర్వహించింది. ఇందులో పాల్గొన్నవారికి, మట్టితో పనిచేయడం వల్ల కలిగే సృజనాత్మక, చికిత్సా ప్రయోజనాలను తెలియజేసేలా సాగింది. కుండలు మానసిక దృష్టి, ఏకాగ్రతను ఎలా పెంచుతాయో, సృజనాత్మక ప్రక్రియకు మించి రోజువారీ జీవితంలోకి విస్తరించే ప్రశాంతతను, సద్భుద్ధిని ఎలా పెంపొందిస్తాయో ఈ కార్యశాలలో అవగతం చేశారు. చికిత్సా లక్షణాలకు ప్రసిద్ధి చెందిన కుండలు చేతులను బలపరుస్తాయని, ఒత్తిడిని తగ్గిస్తాయని, మొత్తం మీద స్వాంతనను ఇస్తాయని నిర్వాహకులు వివరించారు. బంకమట్టిని అచ్చువేసే స్పర్శ అనుభవం, ఆందోళన తగ్గించడానికి సహాయపడడమే గాక, కొంత ఉపశమనం ఇవ్వడంతో పాటు మానసిక, శారీరక చురుకుదనాన్ని పెంచుతుందన్నారు.ఈ కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, జీఎస్ హెచ్ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సన్నీ జోస్, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ వై.లలితా సింధూరి, కోర్సు సమన్వయకర్త డాక్టర్ ఆదిశేషయ్య సాడే తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *