శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి :
నవతెలంగాణ దినపత్రిక 2023 నూతన క్యాలెండర్ ను శనివారం రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గల మసీద్ బండ లోని ఆయన నివాసంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ఆవిష్కరించారు. పత్రికలు అధికార పక్షాలకు తొత్తులుగా మారకుండా నిష్పక్షపాతoగా నిజాలను వెలికితీయాలని కోరారు. ఎప్పుడు కూడా నవతెలంగాణ ప్రజా సమస్యలు వెలికితీయడంలో ముందుంటుందని, అదేపంథాను కొనసాగించాలని సూచించారు. ఎప్పుడు మా వంతు సహాయ సాకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, ఆర్ కె వై టీమ్ సభ్యులు గుండె గణేష్ ముదిరాజ్, జాజేరావు శ్రీను, రాము, ప్రేమ్ శేఖర్, లక్ష్మణ్, దుర్గేష్ రిపోర్టర్లు నర్సింలు ముదిరాజ్, లక్ష్మీ కాంత్ తదితరులు పాల్గొన్నారు.