మన బస్తీ బాట అంటు ప్రజాసమస్యల పై గళమెత్తిన మారబోయిన రవి యాదవ్.

politics Telangana

మనవార్తలు ప్రతినిధి శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి నియోజకవర్గం పాపిరెడ్డి అండర్ పాస్ బిడ్జిలో నిలిచిపోయిన మురికి నీటిని తొలగించాలని కోరుతూ బుధవారం బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మారబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో మహిళలు యువకులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు, తారా నగర్ లోని తుల్జా భవాని ఆలయంలో రవి యాదవ్ మహిళలు పురుషులతో కలిసి పూజలు నిర్వహించారు, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సమస్యలు ఉండకుండా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన తుల్జా భవాని అమ్మవారికి మొక్కుకున్నారు,అక్కడినుండి శేరిలింగంపల్లి రైల్వే బ్రిడ్జి వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పాపి రెడ్డి కాలనీ చందానగర్ అండర్పాస్ రైల్వే బ్రిడ్జి వరకు పాదయాత్ర తో వచ్చి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ పనితీరు బాగాలేదని చందానగర్ అండర్పాస్ రైల్వే బ్రిడ్జి సమస్య పూర్తి పరిష్కారం కావాలని కోరారు, మున్సిపాలిటీ వాళ్లు పట్టిoచుకోవట్లేరనీ ప్రభుత్వం మరి మా బతుకులకి విలువ లేదా అని ఆవేదన పడుతున్నారనీ, పాపిరెడ్డి ప్రజలు, కెసిఆర్ తెచ్చిన పదేండ్ల పాలనలో చేసిన రోడ్డులో ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసి కాంగ్రెస్ చేసిందని చెప్పుకుంటున్నారని తెలిపారు.బి ఆర్ ఎస్ వాళ్లు వచ్చి ఫోటోలు దిగి ఫోతున్నారని, హెడ్డెవచేశారు. మరి ఇపుడు కనులకి కనిపిస్తలేదా అని కార్పొరేటర్ ని ఎమ్మెల్యే గాంధీని ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమం లో కే.ఎన్.రాములు, స్వామీనాథ్,వెంకటరెడ్డి, చారీ, శ్రీకాంత్ యాదవ్, శ్రీశైలం యాదవ్,గడ్డం శ్రీనివాస్,సురేష్ యాదవ్,గడ్డం మహేష్, గంగాధర్ గౌడ్, కొండకల శ్రీనివాస్, నవీన్ గౌడ్, సాయి నందన్ ముదిరాజ్, పవన్, స్వామి, రాజు గౌడ్, వడ్డే శ్రీనివాస్, జంగయ్య, బాలరాజు, శంకర్, మున్నా, రాజు గౌడ్ ,శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ, రవి, మజీద్, వెంకటేష్, నర్సింహా, రామదేవి, స్వరూప, శశికల, దివ్య, నిరూప, అనిత, రాజేశ్వరి,ఆశ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *