మనవార్తలు ,పటాన్ చెరు:
దసరా పండుగను పురస్కరించుకొని పటాన్ చెరు పట్టణంలోని బుధవారం ముత్తంగి చర్చ్ పక్కన మైదానంలో నిర్వహించిన దసరా సంబరాల్లో పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని రావణ దహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రజలకు దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు, అందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా నిర్వహించి దసరా పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేసిన యస్.ఆర్.కె యువసేన సభ్యులకు ఆయన ప్రశంసించారు.రావణ దహన ఘట్టాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కుమార్ గౌడ్, ఉప సర్పంచ్ లింగారెడ్డి, నరసింహ గౌడ్, పవన్, అశ్వంత్, బాబు రాజ్ గౌడ్, ఈశ్వరయ్య, రామ్ రెడ్డి, కృష్ణ, బైండ్ల కుమార్, కిట్టు ముదిరాజ్, దేవెందర్ గౌడ్, సురేష్, అంజద్, శ్రీధర్ గౌడ్, ప్రభాకర్, మల్లేష్, సుజాత, పున్యవతి, యస్.ఆర్.కె యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.