మహనీయుల ఆశయాలు కొనసాగించాలి
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,పటాన్చెరు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ సంస్కరణలు చేపట్టి దేశానికే స్ఫూర్తిగా నిలుస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని కర్ధనూరు గ్రామంలో ని పల్లె ప్రకృతి వనం లో ఏర్పాటుచేసిన జాతిపిత మహాత్మా గాంధీ, తెలంగాణ తల్లి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చిన్న జిల్లాలు, చిన్న గ్రామ పంచాయతీలు ఏర్పాటుచేసి పరిపాలన వికేంద్రీకరణ చేయడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో తీసుకొచ్చిన పరిపాలనా సంస్కరణలు చూసి పక్క రాష్ట్రాలు సైతం తెలంగాణను స్ఫూర్తిగా తీసు కోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామంలో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం పట్ల పాలకవర్గాన్ని ఆయన అభినందించారు. భవిష్యత్ తరాలకు వారి యొక్క ఆశయాలను అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కర్ధనూరు గ్రామపంచాయతీ పాలకవర్గం మూడు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా 10 లక్షల రూపాయల నిధులు కేటాయిస్తున్నాట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువతకు వాలీబాల్, క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు.
అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. గ్రామంలో 100% వ్యాక్సినేషన్ పూర్తిచేసిన వైద్య, అంగన్వాడి సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ వడ్డే కుమార్, ఎంపీటీసీ నాగజ్యోతి లక్ష్మణ్, ఎంపీడీవో బన్సీలాల్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.