అత్యాచారానికి పాల్పడ్డ నిందులకు ఉరిశిక్ష వెయ్యాలి – ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్

Hyderabad politics Telangana

శేరిలింగంపల్లి :

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పేషంట్ ఈ నెల 5 వ తేదీన గాంధీ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన పేషెంట్ తో వచ్చిన మహిళల మీద అత్యాచారం చేసిన వ్యక్తుల మీద కటిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు యువరాజ్ ముదిరాజ్ తెలిపారు.మహిళలు ఎక్కడ రక్షణ లేదు,ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కొంత మంది మృగాలు మారట్లేదు మొన్న మేడ్చల్ లో రేపు చేసిన వ్యక్తిని నిందితున్ని వదిలేశారు , అందుకే నిందితులకు భయం లేకుండా ఇలాంటివి పునరావృతం అవుతున్నాయని గాంధీ హాస్పిటల్ లో జరిగిన ఘటన శోచనీయమన్నారు.

మహిళలకు ఎక్కడ రక్షణ కల్పిస్తుంది ఈ ప్రభుత్వం . మానభంగం జరిగిన వెంటనే నిందితులను దిశ కేసు లో ఎన్కౌంటర్ చేసినట్టు చేస్తేనే నేరానికి పాల్పడ్డ మృగాలకు నిజమైన శిక్ష విధించి నట్టని మహిళలను ఎక్కడికైనా ఒంటిరిగా బయటికి పంపిద్దం అంటేనే భయం వేస్తుందన్నారు.హాస్పిటల్ లో కూడా రక్షణ లేకుంటే ఈ సమాజం ఎక్కడికి పోతుందో అర్దం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇద్దరి మహిళల మీద 8 రోజుల పాటు హత్యాచారం చేసి ఒక్క మహిళను హాస్పిటల్ లో వదిలేసి ,ఇంకొక మహిళను ఎక్కడ ఉంచారో తెలియదని, నిందితులను విచారించి ఆ మహిళ ఆచూకీ తెలుసుకొని కాపాడా ల్సిందిగా కోరుతున్నామని ఈ చర్యకు పాల్పడ్డ నిందితులను పట్టుకొని వెంటనే ఎన్కౌంటర్ చెయ్యాలని ముదిరాజ్ యువజన సమాఖ్య తరుపున రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నామని,

లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా బిసి సంగమ్ అధ్యక్షుడు మరియు ముదిరాజ్ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెలుగు నర్సింలు ముదిరాజ్ మరియు ముదిరాజ్ సంగం నాయకులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *