Telangana

పటాన్ చెరులో అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం

_పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని భక్తుల జయజయధ్వానాల మధ్య, జై శ్రీరామ్ నినాదాల హోరులో పటాన్చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభిజిత్ లగ్నంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా జరిగింది. గురువారం ఉదయం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు, వారి కుటుంబ సభ్యులు మేళతాళాల మధ్య తమ స్వగృహం నుండి వేడుకగా బయలుదేరి స్వామి వార్లకు పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో అర్చకులు సాంప్రదాయబద్దంగా కల్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం ఆలయ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు తరలివచ్చారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఎమ్మెల్యే జిఎంఆర్ సూచనలకు అనుగుణంగా ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సౌకర్యాలు కల్పించారు. పటాన్చెరు పట్టణం మొత్తం విద్యుత్ దీపాల వెలుగులతో నిండి పోయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఆ భగవంతుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని బండ్ల గూడ, రామచంద్రపురం డివిజన్ల పరిధిలో నిర్వహించిన సీతారాముల కల్యాణోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ, నందీశ్వర్ గౌడ్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ జెడ్పీటీసీ జైపాల్, మాజీ కార్పొరేటర్ సపాన్ దేవ్, ఆలయ కమిటీ చైర్మన్ మనోహర్ రెడ్డి, గూడెం మధుసూదన్ రెడ్డి, పట్టణ పుర ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago