నేటి తరం యువతకు ఆదర్శం రమేష్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

politics Telangana

కంటి చూపు లేకపోయినా డిగ్రీ ఉత్తీర్ణత కంప్యూటర్ కోర్సులు పూర్తి

దివ్యాంగుడి కోటాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లుతోపాటు,పెన్షన్ అందించిన ఎమ్మెల్యే జీఎంఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కంటి చూపు లేకపోయినా అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే ధ్యేయంగా మొక్కవోని దీక్షతో గ్రాడ్యుయేషన్ తో పాటు మూడు కంప్యూటర్ కోర్సులు పూర్తి చేసిన దివ్యాంగుడు రమేష్ జీవితం నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకమని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్‌చెరు పట్టణానికి చెందిన రమేష్ తొమ్మిదవ తరగతి చదివే సమయంలో కంటి చూపు కోల్పోయాడు. ఉన్నది చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యం నీరుగారిపోవడంతో తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో స్థానిక రైల్వే ఉద్యోగి.. మైత్రి క్రికెట్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి రమేష్ పరిస్థితిని తెలుసుకొని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో వెన్నంటి నిలిచారు. పదవ తరగతితో పాటు పటాన్చెరు పట్టణంలోని డాక్టర్ అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాలలో ఓపెన్ డిగ్రీ చదివేల ప్రోత్సహించి.. ఉత్తీర్ణత అయ్యేలా సహకరించారు. రైల్వే డిపార్ట్మెంట్లోని అంద ఉద్యోగుల సహకారంతో వివిధ కంప్యూటర్ కోర్సులు పూర్తిచేసేలా కృషి చేశారు.

అనంతరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో దివ్యాంగుల కోటాలో. ప్రభుత్వ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు ప్రభుత్వ పెన్షన్ అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు రమేష్. తన ఉన్నతికి వెన్నంటి నిలుస్తూ సంపూర్ణ సహకారం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ..వితంలో ఒక లక్ష్యం నిర్దేశించుకోవడం అంటే, మనం సాధించాలనుకున్నది ఏమిటో స్పష్టంగా తెలుసుకోవడమణి.. ఈ అంశంలో రమేష్ కంటి చూపు లేకపోయినా లక్ష్యాన్ని నిర్దేశించుకుని అకుంఠిత దీక్షతో పూర్తి చేశారని అభినందించారు.రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించేలా శిక్షణ ఇప్పించడంతోపాటు.. తాత్కాలికంగా ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రమేష్ విజయంలో శిక్షకుడిగా సహకారమందించిన మైత్రి క్లబ్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డిని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *