– టీఆర్ఎస్ కెవి రాష్ట్ర అధ్యక్షులు జి.రాంబాబు యాదవ్
– ఎమ్మెల్యే కాలే యాదయ్య
– మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ
– కె.వి.రమణారెడ్డి పదవి విరమణ
మనవార్తలు ,పటాన్ చెరు:
కార్మికుల శ్రేయస్సు కోరే వ్యక్తి రమణారెడ్డి అని టీఆర్ఎస్ కెవి రాష్ట్ర అధ్యక్షులు జి.రాంబాబు యాదవ్, ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ లు అన్నారు. శుక్రవారం ఓడిఎఫ్ తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు కె.వి.రమణారెడ్డి పదవీ విరమణ కార్యక్రమం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ కెవి రాష్ట్ర అధ్యక్షులు జి.రాంబాబు యాదవ్, ఎమ్మెల్యే కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కె.వి.రమణారెడ్డి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఎంతో కృషి చేశారని కొనియాడారు.
తెలంగాణ ఉద్యమంలో సైతం తన వంతు కృషి చేశారని అన్నారు. ఎంతమంది కార్మికుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేశారని గుర్తు చేశారు. పదవి విరమణ పొంది, వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో గడపాలని వారు ఆకాంక్షించారు. పదవి విరమణ పొందిన కూడా కార్మికుల సమస్యల పరిష్కారాలకు సలహాలు, సూచనలు సూచించాలని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కెవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నారాయణ, ఈఎస్ఐ బోర్డ్ మెంబర్ లు మారయ్య, రెబ్బ రామారావు, సంగారెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, మాజీ జెడ్పిటిసి మనోహర్ గౌడ్, టీఆర్ఎస్ కెవి జిల్లా అధ్యక్షులు శివ శంకర్ రావు, మాజీ ఎంపీపీ యాదగిరి యాదగిరి యాదవ్, విజయ్ కుమార్ తో పాటు ఓడిఎఫ్ అన్ని సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు, టీఆర్ఎస్ కెవి అనుబంధ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలతో పాటు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…