మనవార్తలు ,రామచంద్రపురం:
రామచంద్రపురం మండలంలో మందమూల గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ ఆలయం నందు శ్రావణమాసం బోనాలు సందర్భంగా స్థానిక యువజన నాయకులైన బచ్చలి శేఖర్ బాబు ఆదర్యంలో ప్రత్యేక అతిధిగా తెరాస రాష్ట్ర నాయకులైన నీలం మధు ముదిరాజ్ , పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ నీలం మధు మాట్లాడుతూ పండగలకు, ఉత్సవాలకు, ప్రాధాన్యత కల్పించింది తెరాస ప్రభుత్వమేనని అధికారంగా నిర్వహించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలియజేశారని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు .
తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని వేడుకున్నా అని తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందుకుని ఆలయ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలోయువజన సభ్యలు ,స్థానిక కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమానికి సహకరించిన అందరికి నీలం మధు ముదురాజ్ ప్రత్యేకంగా అభినందించారు.