రామచంద్రపురం 112 డివిజన్ నూతన బీజేపీ అధ్యక్షుడుగా ఎన్ నర్సింగ్ గౌడ్

Districts politics Telangana

మనవార్తలు ,రామచంద్రపురం:

సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం రామ‌చంద్రాపురం 112 వ డివిజ‌న్ అధ్య‌క్షుడిగా నియమించ‌డం ప‌ట్ల ఎన్ న‌ర్సింగ్ గౌడ్ సంతోషం వ్య‌క్తం చేశారు .సామాన్య కార్య‌క‌ర్త స్థాయి నుంచి డివిజన్ స్థాయి అధ్య‌క్షుడిగా నియ‌మించిన బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు న‌రేంద‌ర్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు . జిల్లా అధ్య‌క్షులు న‌రేందర్ రెడ్డి చేతుల మీదుగా రామ‌చంద్రాపురం 112 వ డివిజ‌న్ అధ్య‌క్షుడిగా బీజేపీ నేత‌లు ,కార్య‌క‌ర్త‌ల‌తో స‌మ‌క్షంలో నియామ‌క ప‌త్రాన్ని అందుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు .

తెలంగాణ‌లో జ‌రిగే బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయ‌ని ఈ స‌మావేశాల‌కు దేశంలోని బీజేపీ పాలిత ప్రాంత ముఖ్య‌మంత్రులు, కేంద్ర మంత్రులు ,ఎంపీలు రానున్న‌ట్లు ఆయ‌న తెలిపారు . సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్ లో జ‌రిగే ప్ర‌ధాని మోడీ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ కార్యకర్తలతో, ప్రజలతో నిరంతరం సేవలో నిమగ్నమై పార్టీ అభివృద్ధికై కృషి చేస్తాన‌ని ఎన్ న‌ర్సింగ్ గౌడ్ అన్నారు . రాబోయే ఎన్నికలలో పటాన్ చేరు నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగుర వేస్తామని ధీమా వ్య‌క్తం చేశారు . యువతకు క్రికెట్ కిట్ ల‌ను అందజేయడం జరిగిందని  రానున్న రోజులలో అనేక సేవ కార్యక్రమంలో చేప‌డ‌తామ‌న్నారు . బిజెపి పార్టీ కార్యకర్తలు, మహిళలు , అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు .

ఈ కార్యక్రమంలో బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి , జిల్లా కార్యదర్శి మహేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళా నాయకులు గోదావరి అంజి రెడ్డి , పటాన్చెరు అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్త, రామచంద్రపురం ప్రధాన కార్యదర్శి పద్మ వతి,రామ్ ప్రసాద్ గుప్త, జిల్లా కార్యవర్గ సభ్యులు నరేందర్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బిల్లా రవి, ఓబీసీ మోర్చా టౌన్ అధ్యక్షులు రవి యాదవ్, జిల్లా మహిళా మోర్చా పాదాదికారులు కవిత మరియు అనూష , కారికే ప్రవీణ్ , బలరాం, పట్టణ ఉపదక్షులు మల్లేష్ , ప్రహ్లదు సింగ్ , పి విష్ణువర్ధన్ రెడ్డి , కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *