పటాన్చెరు లో ఘనంగా రాహుల్ జన్మదిన వేడుకలు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. రాహుల్ బర్త్ డేను పురస్కరించుకొని మున్సిపల్ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్స్ మరియు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మున్సిపాలిటీ మల్లారెడ్డి కాలనీ కౌన్సిలర్ లావణ్య శశిధర్ రెడ్డి , సంగా రెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుకాట సుధా శ్రీనివాస్ గౌడ్ కౌన్సిలర్లు గోపి, మున్నా, విజయ్, నాయకులు ఈశ్వర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మహేష్, మహిపాల్ రెడ్డి, లక్ష్మీకాంతరావు, చుక్క రెడ్డి, రామచంద్రారెడ్డి, సత్యనారాయణ, మనోహర్, అప్పారావు, కృష్ణ యాదవ్, లక్ష్మీ నారాయణ యాదవ్, శ్రీనివాస్, మల్ల రావు తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ కిషోర్ కాలనీలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఇక్రిసాట్ కాలనీలో ఘనంగా జరిగాయి. రాహుల్ జన్మదినాన్ని పురస్కరించుకొని మునిసిపల్ సిబ్బందికి నిత్యావసర సరుకులను సంగా రెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్లోర్స్ గోపి, మున్నా, విజయ్, లింగంగౌడ్, మహేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.