ప్రశ్నించే గొంతుక కమ్యూనిస్టులు

politics Telangana

– ఎర్రజెండా లేకపోతే ప్రజా సమస్యలు చర్చకే రావు

-సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆహ్వాన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జే మల్లికార్జున్ కు ఏషియన్ పెయింట్స్ కార్మికులు విరాళాలు అందజేత

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రశ్నించే గొంతుక కమ్యూనిస్టులని ఎర్రజెండా లేకపోతే ప్రజా సమస్యలు చర్చకే రావని సిపిఎం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జే మల్లికార్జున్ అన్నారు. బుధవారం పటాన్ చెరు పట్టణంలోని శ్రామిక భవన్ లో సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏషియన్ పెయింట్ కార్మికులు విరాళాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ దేశంలో ఎర్రజెండా లేకపోతే ప్రజా సమస్యలు చర్చకే రావని ఆయన అన్నారు, ఎర్రజెండా ఉండడం వల్లనే చట్టసభలలో ప్రజా సమస్యలపై నిలదీయడం జరుగుతుందని, పోరాటం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఎర్రజెండ లేకపోతే దేశంలో ప్రజల తరఫున, పేదల తరఫున ప్రశ్నించే వాళ్ళే ఉండరని ఆయన అన్నారు, ప్రజలకు సంబంధించింది ఏ ఒక్క సమస్యను కూడా అడిగేవాళ్లు ఉండరని, అందుకే ఎర్రజెండా బలపడాలని, కమ్యూనిస్టులు ఉండాలని ఆయన అన్నారు. కమ్యూనిస్టులు లేని దేశాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడాలని ఆయన గుర్తు చేశారు, కమ్యూనిస్టులు బలంగా ఉన్నచోట, అధికారం ఉన్నచోట ఆయా దేశాలు అభివృద్ధి చెందుతున్నాయని, ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. కమ్యూనిస్టులు బలంగా ఉన్నచోట ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, ప్రజా పోరాటాలు ఉదృతంగా కొనసాగుతున్నయని తెలిపారు. వచ్చే నెల 25 నుండి 28 వరకు జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విరాళాలు అందజేసిన ఏషియన్ పెయింట్స్ కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య,ఏషియన్ పెయింట్ కార్మిక నాయకులు మనీ రాజు,బిఎస్ రెడ్డి,రాజా, ముత్యాలయ్య,గట్టయ్య,జనార్ధన్ తదితర కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *