Telangana

ప్రశ్నే పురోగతికి సోపానం

గీతంలో జాతీయ సైన్స్ దినోత్సవంలో సీసీఎంబీ పూర్వ డైరెక్టర్ మోహన్ రావు వ్యాఖ్య

 మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: 

ప్రశ్నించే స్ఫూర్తి, ఉత్సుకత శాస్త్రీయ పురోగతికి సోపానాలని బిట్స్ పిలాని-హైదరాబాదు బయోలాజికల్ సైన్సెస్ విభాగాధిపతి, సీనియర్ ప్రొఫెసర్ ఎమెరిటస్, హైదరాబాదులోని సెల్యులార్, మాలిక్యులర్ బయాలజీ కేంద్రం (సీసీఎంబీ) పూర్వ డైరెక్టర్ సీహెచ్. మోహన్ రావు అన్నారు. హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని గురువారం ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన కీలకోపన్యాసం చేశారు. సర్ సి.వి. రామన్ వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ, భారతదేశం అపారమైన జ్జానం, ప్రతిభను కలిగి ఉన్నప్పటికీ, వాస్తవ ప్రపంచ సమస్యలకు జ్జానాన్ని అనుసంధానించడంలో విఫలమవుతున్నా మని ఆవేదన వెలిబుచ్చారు. పరిశీలన, విమర్శనాత్మక ఆలోచన, ఆవిష్కరణలను విద్యార్థులు పెంపొందించుకోవాలని ప్రోత్సహించారు. దేశం యొక్క శాస్త్రీయ వృద్ధికి అర్థవంతంగా దోహదపడటానికి పరిశోధన అవకాశాలు, ఫెలోషిప్ లు, డాక్టోరల్ అధ్యయనాలను చురుకుగా చేపట్టాలని డాక్టర్ మోహన్ రావు హితవు పలికారు.

‘సైన్స్ లో భారతీయ మహిళలు – వికసిత్ భారత్ ను ఉత్ర్పేరకపరచడం’ అనే స్ఫూర్తిదాయకమైన ఇతివృత్తంతో, దేశ శాస్త్రీయ పురోగతిని రూపొందించడంలో పరివర్తనాత్మక పాత్ర పోషించిన మార్గదర్శక భారతీయ మహిళా శాస్త్రవేత్తల విశేష కృషిని గౌరవించేందుకు గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.మొక్కల సైటోజెనెటిక్స్ లో తన మార్గదర్శక కృషికి పేరుగాంచిన ప్రముఖ వృక్షశాస్త్రజ్జురాలు ఎడవలేత్ కక్కట్ జానకి అమ్మాల్; 19వ శతాబ్దంలో, సామాజిక అడ్డంకులను ఛేదించి మనదేశపు భారతదేశపు మొట్టమొదటి మహిళా వైద్యురాలిగా నిలిచిన ఆనందిబాయి గోపాల్ రావ్ జోషి; సేంద్రీయ రసాయన శాస్త్రానికి చేసిన అద్భుతమైన కృషికి భారతీయ విశ్వవిద్యాలయం నుంచి సైన్స్ డాక్టరేట్ పొందిన తొలి మహిళ అసిమా ఛటర్జీ; భారతదేశంలో వాతావరణం, వాతావరణ పరిశోధనలను గణనీయంగా అభివృద్ధి చేసిన అన్నా మణి వంటి విశిష్ట మహిళా శాస్త్రవేత్తలకు ఈ వేడుకలలో నివాళులర్పించారు.

 

తొలుత, ప్రొఫెసర్ మోహన్ రావు గీతంలోని ప్రతిష్టాత్మక మూర్తి ల్యాబ్ (అనువాద చొరవలపై బహుళ విభాగ పరిశోధనా విభాగం)ను సందర్శించారు. సహకార పరిశోధన ద్వారా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించే క్రాస్-డిసిప్లినరీ థింక్ ట్యాంక్ గా పనిచేయడం దీని లక్ష్యం. ఈ సందర్శనలో భాగంగా, డాక్టర్ మోహన్ రావు బయోటెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్ లాబొరేటరీని కూడా ప్రారంభించారు. ఆ తరువాత లైఫ్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఫార్మసీ విభాగాల అధ్యాపకులతో ముఖాముఖి చర్చించారు.ఈ కార్యక్రమంలో గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్.రావు, గీతం విశిష్ట ఆచార్యులు డాక్టర్ ఎస్. చంద్రశేఖర్, డాక్టర్ బి.వి.ఆర్.టాటా, పలు విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

సెయింట్ ఆన్స్, సెయింట్ జోసెఫ్, స్ఫూర్తి, ప్రగతి డిగ్రీ కళాశాలల నుంచి 500 మంది డిగ్రీ విద్యార్థులు ఈ జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. భారతదేశపు మార్గదర్శక మహిళా శాస్త్రవేత్తల వారసత్వాన్ని ప్రతిబింబించడానికి, అభివృద్ధి చెందిన, స్వావలంబన భారతదేశం యొక్క దార్శనికతకు దోహదపడటానికి, వారి నిబద్ధతను పురుద్ఘాటించడానికి ఈ వేడుకలు విద్యార్థులకు ఒక శక్తివంతమైన వేదికను అందించాయి. స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రెజా వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago