పటాన్ చెరువు
పటాన్ చెరువు మండలం ముత్తంగి గ్రామానికి చెందిన హరి పంతుల పుష్ప వెంకట్ రావు గారు సోమవారం బీజేపీలో చేరారు.పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ గారి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ పాదయాత్ర లో పాల్గొని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. దేశం కోసం మన ప్రధాని నరేంద్రమోడీ ఎంతో కృషి చేస్తున్నాడని ఆమె అన్నారు. 2023 తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కాయమని ఆమె తెలిపారు . ప్రజాసంగ్రామ యాత్రలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పటాన్ చెరువు మండల బీజేపీ అధ్యక్షులు ఈశ్వరయ్య, దేవెంతర్ గౌడ్, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు
