Telangana

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

నియోజకవర్గ ప్రజల సంక్షేమం.. ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. సోమవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలో వివిధ గ్రామాలు, పట్టణాలు, డివిజన్లకు సంబంధించిన సంబంధించిన 54 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా మంజూరైన 24 లక్షల 43 వేల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ వైద్య చికిత్సల నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అండగా నిలుస్తుందని తెలిపారు. దీని ద్వారా ప్రతి నెల లక్షలాది రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసిలు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిన్నారం మాజీ జెడ్పీటీసీ బాల్ రెడ్డి. అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, సీనియర్ నాయకులు సత్యనారాయణ, వెంకటేష్, ఐలేష్, రామచంద్రా రెడ్డి, శివరాజ్, శివా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

4 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

6 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

1 day ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

1 day ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago