19 మంది లబ్ధిదారులకు 7 లక్షల 22 వేల రూపాయల విలువైన
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
నియోజకవర్గ ప్రజల సంక్షేమం ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. మంగళవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలో వివిధ గ్రామాలు, పట్టణాలు, డివిజన్లకు సంబంధించిన సంబంధించిన 19 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా మంజూరైన 7 లక్షల 22 వేల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ వైద్య చికిత్సల నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ఆర్థిక భరోసా కల్పిస్తూ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అండగా నిలుస్తుందని తెలిపారు. దీని ద్వారా ప్రతి నెల లక్షలాది రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసిలు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
