రాష్ట్రంలో ఐటి పరిశ్రమలు అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రజానేత కేటీఆర్ _ చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

politics Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా సోమవారం చిట్కుల్ గ్రామంలో తుల్జా భవాని దేవాలయంలో నీలం మధురాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇస్నాపూర్ చౌరస్తాలో అభిమానులు, బి ఆర్ఎస్ కార్యకర్తల, ప్రజల సమక్షంలో ఘనంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు .హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ పథకం కింద వికలాంగులకు 4,016 రూపాయిలు పెంచిన సందర్భంగా కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు .ఇస్నాపూర్ గ్రామంలో దివ్యాంగుల జీవనోపాధి కేంద్రాన్ని ప్రారంభించి ,ఇద్దరు దివ్యాంగులకు జీవనోపాధి కి ఉపయోగపడేలా రెండు కుట్టు మిషన్లను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ పంపిణీచేశారు.

కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొనిఇంద్రేశం గ్రామ శివారులో మదర్ తెరెసా వృద్ధాశ్రమం లో కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి ,అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ,అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రానికి వేల కోట్లు పెట్టుబడి అందించే పరిశ్రమలు తీసుకురావడంలో కేటీఆర్ పాత్ర కీలకమని ఆయన తెలిపారు.అలాగే తెలంగాణ ప్రజల సంక్షేమ పథకాల అమల్లో కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నారని , మరోపక్క రాష్ట్రంలో ఐటి పరిశ్రమలు అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రజానేత అని అన్నారు ఇలాంటి నాయకుడికి పది కాలాలపాటు చల్లగా ఉండాలని తెలంగాణ ప్రజలు ఆశీర్వచనం అందజేయాలన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నతంగా నిలపడం లో మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి మర్చిపోలేమని తెలిపారు .ఈ కార్యక్రమాల్లో ప్రజలు,పార్టీ కార్యకర్తలు, అభిమానులు,ఎన్ఎమ్ అర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *